విజయవాడ టీడీపీ ఎంపీ క్యాండెట్‌గా దేవినేని ఉమా… బాబు మార్క్ ట్విస్ట్…!

రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగొచ్చు. రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు డిఫరెంట్‌గా ఉంటాయి. వచ్చే ఎన్నికలు మరింత ప్రతిష్టాత్మకం కావడంతో రాజకీయ పార్టీలు గెలుపు గుర్రం ఎక్కేందుకు తమ తమ ప్రయత్నాల్లో ఉన్నాయి. అయితే.. ఈ క్రమంలో సిట్టింగ్ స్థానాల్లోనూ మార్పులు చోటు చేసుకుంటు న్నాయి. ఈ క్రమంలో కీలకమైన స్థానాల్లోనూ నేతలను మారుస్తున్నారు.
తాజాగా ఉన్న సమాచారం ప్రకారం.. విజయవాడ పార్లమెంటు స్థానం నుంచి మాజీ మంత్రి, మైలవరం మాజీ ఎమ్మెల్యేదేవినేని ఉమా మహేశ్వరరావు కు వచ్చే ఎన్నికలలో టికెట్ ఇస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం ఎంపీగా ఉన్న కేశినేని నాని వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉత్సాహం చూపించకపోవడం.. పార్టీలోనూ ఆయన దూరంగా ఉండడంతో ఆ సీటును దేవినేని ఉమాకు ఇవ్వాలని భావిస్తున్నారు.
అదే సమయంలో మైలవరం నుంచి వచ్చే ఎన్నికల్లో వైసీపీ బీసీ (గౌడ) నేతకు టికెట్ ఇవ్వాలని వ్యూహం రెడీ చేసుకున్నట్టు సమాచారం. నాలుగు సార్లు ఓటమి లేకుండా నందిగామ, మైలవరం నుంచి గెలిచిన దేవినేని ఉమా గత ఎన్నికల్లో ఫస్ట్ టైం మైలవరంలో ఓడిపోయారు. ఆయన మైలవరంకు నాన్ లోకల్. పైగా ఆయనకు మైలవరంలో వ్యతిరేకత అలాగే ఉంది. అక్కడ లోకల్ డిమాండ్ తెరమీదకు వస్తోంది.
ఉమా కూడా ఎందుకో మైలవరంలో అంత యాక్టివ్‌గా ఉన్నట్టు కనిపించడం లేదు. ఒకప్పుడు బిగ్గరగా వినిపించే ఉమా గొంతు ఇటీవల ఎందుకో బాగా స్లో అయ్యింది. ఇటు చంద్రబాబుకు విజయవాడలో ఎలాగగూ కేశినేని తలనొప్పులు ఉండనే ఉన్నాయి. ఈ క్రమంలోనే మైలవరంలో వచ్చే ఎన్నికల్లో జగన్ బీసీ క్యాండెట్‌ను దింపాలని చూస్తున్నారు. వైసీపీకి చెక్ పెట్టేందుకు టీడీపీ నుంచి కూడా బీసీ నేతను రంగంలోకి దించాలని టీడీపీ అధినేత భావిస్తున్నారు.
ఈ క్రమంలోనే అనూహ్యంగా దేవినేని ఉమా పేరు.. విజయవాడ పార్లమెంటు కోసం పరిశీలిస్తున్నారని అంటున్నారు. మరోవైపు.. విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ను కూడా గన్నవరం పంపించనున్నట్టు తెలుస్తోంది. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. వైసీపీకి అనుకూలంగా మారిపోయిన నేపథ్యంలో ఆయనను ఓడించేందుకు.. బలమైన నేతను రంగంలోకి దింపాలని ఇనర్ణయించుకున్నారు.
ఈ క్రమంలో గతంలో ఇక్కడ నుంచి ఎంపీగా గెలిచిన గద్దెను అక్కడకు పంపి.. తూర్పు నియోజకవర్గం టికెట్‌ను ఎంపీ కేశినేని నాని కుమార్తె, ప్రస్తుతం కార్పొరేటర్‌గా ఉన్న శ్వేతకు ఇవ్వనున్నారని సమాచారం.