సుజాత – రాకింగ్ రాకేష్ లవ్ స్టొరీ….వామ్మో మామూలు ట్విస్ట్ లు లేవుగా….!

ఈటీవీ ప్రసారం అవుతున్న జబర్దస్త్ కామెడీ షో చాలా మందికి లైఫ్ ఇచ్చింది. అంతే కాకుండా ఈ షోకు వచ్చిన తరవాత ప్రేమలో పడినవాళ్లు ఆ పెళ్లిచేసుకుని ఒక్కటైన వాళ్లు కూడా ఉన్నారు. ఈ షో ద్వారా అభిమానులను సంపాదించుకున్నవాళ్లలో రాకింగ్ రాఖేష్ కూడా ఒకరు. మొదట టీం లో కమెడియన్ గా వచ్చిన రాకేష్ ఆ తరవాత టీం లీడర్ గా ఎదిగాడు. అయితే చాలా వరకు జబర్దస్త్ కమెడియన్స్ లు చేసే స్కిట్ లలో భూతులు ఉంటాయి. కానీ రాకింగ్ రాకేష్ హెల్తీ కామెడి పండిస్తాడు.
అంతే కాకుండా చిన్నపిల్లలతో కలిసి స్కిట్ లు చేసి నవ్విస్తాడు. ఇక రాకింగ్ రాకేష్ న్యూస్ యాంకర్ జోర్దార్ సుజాత ప్రేమించుకున్న సంగతి తెలిసిందే. జోర్దార్ వార్తలతో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న సుజాత ఆ తరవాత బిగ్ బాస్ టీవీ షోకు ఎంట్రీ ఇచ్చింది. బిగ్ బాస్ ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించుకుంది. ఆ తరవాత సుజాత జబర్దస్త్ లోనూ స్కిట్ లు చేసింది. ఈ క్రమంలో సుజాత రాకేష్ ప్రేమలో ఉన్నట్టు చెప్పారు.
అయితే అదంతా టీఆర్పీ రేటింగ్ కోసం అని అంతా అనుకున్నారు. కానీ ఆ తరవాత ఇద్దరిదీ సీరియస్ రిలేషన్ షిప్ అని చెప్పారు. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో రాకింగ్ రాకేష్ తన లవ్ స్టోరీ గురించి చెప్పాడు. స్పిరిట్యువాలిటీ దిశగా వెళ్లిన తాను స్మశానంలో కూడా పడుకున్నానని రాకేష్ చెప్పుకొచ్చాడు. అక్కడ దొరికే ప్రశాంతత ఇంకెక్కాడా దొరకదు అంటూ సంచలన వ్యాక్యలు చేశాడు. అంతే కాకుండా ఓ ఇంటర్వ్యూలో తనకు సుజాతతో పరిచయం ఏర్పడిందని ఆ తరవాత సుజాత తనకు ప్రపోజ్ చేసిందని చెప్పాడు.
అలా సుజాతతో ప్రేమాయణం మొదలైందని తమ ఫ్యామిలీలో కూడా సుజాత చక్కగా కలిసిపోయిందని అన్నాడు. అంతే కాకుండా తినడానికి తిండి కూడా దొరకని సమయంలో తన తల్లి కడుపుమాడ్చుకుని మరీ తమకు భోజనం పెట్టిందని అన్నాడు. బాబాయ్ హోటల్ షో ద్వారా రాళ్లపల్లి గారితో మంచి అనుభందం ఏర్పడిందని ఆయన లేని లోటు తన జీవితంలో ఉందని రాకేష్ చెప్పాడు.