బట్టలు మార్చుకుంటుంటే చూశాడు… నిర్మాత బండారం బయటపెట్టిన ఆ హీరోయిన్..!

సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు అనే పదం కామన్ గా వినిపిస్తూ ఉంటుంది. గ్లామర్ ఫీల్డ్ కాబట్టి సినిమా అవకాశాల కోసం వచ్చిన వారిని లోబరుచుకోవాలని చాలా మంది ప్రయత్నిస్తుంటారు. అయితే ఇండస్ట్రీలో ఇప్పుడే ఈ వేధింపులు ప్రారంభం కాలేదు. ఒకప్పటి హీరోయిన్ లకు సైతం ఎన్నో చేదు అనుభవాలు ఉన్నాయి.
తాజాగా సీనియర్ హీరోయిన్ రాధాప్రశాంతి సైతం తాను లైంగిక వేధింపులు ఎదురుకున్నట్టు వెల్లడించారు. రాధాప్రశాంతి ఒకప్పుడు హీరోయిన్ గా రెండు మూడు సినిమాలు చేసి ఆ తరవాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స్థిరపడ్డారు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన చాలా సినిమాలలో రాధాప్రశాంతి నటించారు. ఇక తాజాగా ఓ ఇంటర్యూలో రాధాప్రశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాదాల రంగారావు నటించిన ఊరిజమిందారు సినిమాలో ఆయనకు తాను భార్యగా నటించినట్టు తెలిపారు.
ఆ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆ చిత్ర ప్రొడక్షన్ మేనేజర్ దగ్గరనుండి తనకు ఫోన్ వచ్చిందని చెప్పారు. దాంతో మొదట తన సోదరుడు లిఫ్ట్ చేసి ఫోన్ తనకు ఇచ్చారని చెప్పారు. కాగా ఫోన్ లో ఒకసారి గెస్ట్ హౌస్ కు వస్తారా..? ఇక్కడ హీరో, దర్శకుడు, నిర్మాత సిట్టింగ్ లో ఉన్నారని అన్నట్టు తెలిపారు. దాంతో షూటింగ్ అన్న తరవాత వాళ్లందటూ సిట్టింగ్ లో ఉంటారు స్టాండింగ్ లో ఉంటారు. కానీ నా షెడ్యూల్ అయిపోయింది కాబట్టి తాను రానని చెప్పానన్నారు.
కానీ ఆ తర్వాత ఇలా అయితే ఎక్కువ రోజులు ఉండరని ప్రొడక్షన్ మ్యానేజర్ తనకు వార్నింగ్ ఇచ్చాడని..దాంతో తాను తన తమ్ముడితో కలిసి గెస్ట్ హౌస్ కు వెళ్లినట్టు తెలిపారు. అక్కడ మేనేజర్ ను నిదీయడంతో వేరే వాళ్లకి ఫోన్ చేయాలనుకుంటే మీకు వచ్చిందని కవర్ చేశారని చెప్పారు.
ఆ తరవాత మరో షెడ్యూల్ షూటింగ్ లో ఆ సినిమా మేనేజర్ తాను గదిలో బట్టలు మార్చుకుంటూ ఉండగా చూశాడని ఆరోపించారు. దాంతో తాను అతడికి చివాట్టు పెట్టానని అన్నారు. అంతే కాకుండా చెంప చెల్లుమనించానని చెప్పారు. ఇప్పుడు ఆ మ్యానేజర్ టాప్ ప్రొడ్యూసర్ అంటూ రాధాప్రశాంతి అతడి బండారం బయటపెట్టారు.