ఒక్క హీరోయిన్ విషయంలో మాత్రం ఎన్టీఆర్ రూమర్లు ఎదుర్కోక తప్పలేదు.. వాళ్లిద్దరి ప్రేమ నిజమేనా ?

టాలీవుడ్ యంగ్‌టైగర్ ఎన్టీఆర్ తన కెరీర్‌లో 29 సినిమాలు పూర్తి చేసుకుని 30, 31 సినిమాలకు రెడీ అవుతున్నాడు. త్రిబుల్ ఆర్ సినిమా పాన్ ఇండియా హిట్ అవ్వడంతో.. ఇప్పుడు చేసే రెండు సినిమాలను కూడా పాన్ ఇండియా లెవల్లో లైన్లో పెడుతున్నాడు. ఇన్నేళ్ల కెరీర్‌లో ఎన్టీఆర్ ఎంతో మంది హీరోయిన్లతో నటించాడు. గజాలా, కాజల్ అగర్వాల్, సమంత, జెనీలియా, ఇలియానా, సమీరా రెడ్డి లాంటి హీరోయిన్లను పదే పదే రిపీట్ చేసి మరీ నటించాడు.
అయితే ఏ హీరోయిన్ విషయంలోనూ ఎన్టీఆర్‌కు లింకులు ఉన్నాయన్న పుకార్లు రాలేదు. ఎన్టీఆర్ చాలా స్ట్రిక్ట్‌గా ఉండేవాడు. అసలు ఆ పుకార్లకు ఛాన్సే ఇచ్చేవాడు కాదు. తన ఫ్యామిలీ నేపథ్యంతో పాటు తన స్టార్‌డమ్, తెలుగు ప్రజలు, నందమూరి అభిమానులకు తనపై ఉన్న అనంత నమ్మకాన్ని నిజం చేసేందుకే ఎప్పుడూ కష్టపడుతూ ఉండేవాడు. అయితే ఒక్క హీరోయిన్ విషయంలో మాత్రం ఎన్టీఆర్ రూమర్లు ఎదుర్కోక తప్పలేదు.
ఆ హీరోయిన్ ఎవరో కాదు సమీరారెడ్డి. సమీరా రెడ్డి బాలీవుడ్ హీరోయిన్ అయినా కూడా ఆమె తెలుగు అమ్మాయే. ఆమె తండ్రి ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలోని పెనుగొండ మండలం అయితంపూడి గ్రామానికి చెందినవారు. తండ్రి ఉద్యోగరీత్యా ముంబైలో స్థిరపడ్డారు. అక్కడే పుట్టి పెరిగిన సమీరా ముందు మోడలింగ్‌లోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత ఆమె బాలీవుడ్‌లో హీరోయిన్గా సినిమాలు చేసి టాలీవుడ్‌లోకి వచ్చింది.
టాలీవుడ్‌లో ఎన్టీఆర్ పక్కన నరసింహుడు, అశోక్ సినిమాలు చేస్తే రెండూ ప్లాప్ అయ్యాయి. ఆ తర్వాత చిరుకు జోడీగా జై చిరంజీవా సినిమాలో నటిస్తే ఆ సినిమా కూడా ప్లాప్ అయ్యింది. ఆ తర్వాత ఆమె అడ్రస్ లేకుండా పోయింది. అశోక్ సినిమా కోసం ఎన్టీఆరే స్వయంగా ఆమెను రికమెండ్ చేశాడని అప్పట్లో పుకారు లేచింది. ఆమెకు హైదరాబాద్‌లో ఖరీదైన ఏరియాలో ప్లాట్‌తో పాటు ఓ కాస్ట్ లీ కారు కూడా కొనిపెట్టాడని ప్రచారం జరిగింది. అశోక్ ప్లాప్ అయ్యాక మళ్లీ ఎన్టీఆర్ – సమీరా పై ఎలాంటి రూమర్లు అయితే రాలేదు.