శ్రీదేవి.. బోణీకపూర్ ను నమ్మి పెళ్లి చేసుకుంటే అన్నీ వేధింపులా…!

అతిలోక సుందరి శ్రీదేవి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. తమిళ అమ్మాయి అయినా తెలుగు మూలాలు ఉన్న శ్రీదేవి తెలుగులోనే ముందు స్టార్ హీరోయిన్ అయ్యింది. ఆ తర్వాత తమిళ్‌లో కూడా కొన్ని సినిమాలు చేసింది. ఆమెకు తిరుగులేని స్టార్‌డమ్ రావడానికి తెలుగు ఇండస్ట్రీయే కారణం. ఆ తర్వాత కె. రాఘవేంద్రరావు సినిమాలతో ఆమె బాలీవుడ్‌లోకి అడుగు పెట్టి అక్కడ తిరుగులేని స్టార్ హీరోయిన్ అయిపోయింది.
అసలు నార్త్ ఇండియన్ జనాలు శ్రీదేవిని ఓ ఆరాధ్య హీరోయిన్‌గా కొలవడం ప్రారంభించారు. ఆమెకు అక్కడ వరుస ఆఫర్లు భారీ రెమ్యునరేషన్లు రావడంతో అసలు శ్రీదేవి వెనక్కు తిరిగి చూసుకోలేదు. చివరకు ఆమె బాలీవుడ్‌లో స్టార్ హీరో మిథున్ చక్రవర్తితో ప్రేమలో పడి కొన్నాళ్లు సహజీవనం కూడా చేసిందని అంటారు. అయితే మిథున్ తన భార్య యోగితా బాలికి విడాకులు ఇచ్చేందుకు ఒప్పుకోలేదు.
దీంతో చివరకు శ్రీదేవి మిథున్‌ను వదిలేసి తన భార్యను వదులకునేందుకు సిద్ధమైన నిర్మాత బోనీకపూర్‌ను రెండో పెళ్లి చేసుకుంది. అసలు శ్రీదేవి కోరుకుంటే కోటీశ్వరులు, కుర్రాళ్లు, ఎంతోమంది అందగాళ్లు ఆమెను పెళ్లి చేసుకునేందుకు క్యూలో ఉంటే ఆమె మాత్రం తనకంటే వయస్సులో పెద్దోడు, అప్పటికే పెళ్లయ్యి పిల్లలు ఉన్న బోనీకపూర్‌ను పెళ్లి చేసుకుని ఆమె అభిమానుల మనస్సులను గాయపెట్టింది.
శ్రీదేవి వ్యక్తిగతంగా చాలా ఇబ్బందులు పడింది. ఆమెను నమ్మించిన బోనీకపూర్ ఆర్థికంగా వాడుకోవడంతో ఆమె ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడిందట. ఒకానొక టైంలో బోనీకపూర్ తీసిన సినిమాలు ప్లాప్ అయ్యి.. ఆస్తులు కరిగిపోయి.. అప్పులు చేసి… నెలకు రు. 25 లక్షలు వడ్డీలే కట్టేదట. బోనీకపూర్‌ను నమ్మి పెళ్లి చేసుకుని తాను నిండా మునిగిపోయానని తన సన్నిహితులతో చెప్పుకుని ఆమె బాధపడేదట.
అంతేకాకుండా బోనీ కపూర్ మొదటి భార్య, కడుపుతో ఉన్న శ్రీదేవిని కొట్టిందని.. ఆమె కుమారుడు అర్జున్ కపూర్ కూడా శ్రీదేవిని కొట్టినట్టు అప్పట్లో ఆమె ఫ్రెండ్స్‌తో చెప్పుకుని బాధపడిందని అంటారు. చివరకు శ్రీదేవి 55 ఏళ్లకే అనుమానాస్పద స్థితిలో మృతిచెందడం అందరిని కలిచి వేచింది.