ఆ స్టార్ హీరో వల్లే పెళ్లికి దూరమైన నటి సితార… అసలేం జరిగింది..?

సీనియర్ నటీమణులు 35 ఏళ్లు దాటేసి 40 ఏళ్లు వచ్చినా ఇప్పటకీ పెళ్లి చేసుకోవడం లేదు. ఈ లిస్టులో అనుష్క, తమన్నా లాంటి వారు చాలా మందే ఉన్నారు. అయితే 55 ఏళ్లు వచ్చినా కూడా పెళ్లి చేసుకోని హీరోయిన్లు కూడా టాలీవుడ్‌లో ఉన్నారు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా ఉన్న టబు వయస్సు 50 ఏళ్లు దాటేసింది. ఇప్పటకీ పెళ్లి చేసుకోకుండా ఆమె అలాగే ఉండిపోయింది.
ఇక 1990ల్లో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన సితార కూడా 50 ఏళ్లకు చేరువ అయ్యింది. సితార ఇప్పటకీ పెళ్లి చేసుకోలేదు. ఇక సితార సెకండ్ ఇన్సింగ్స్‌లో కూడా దూసుకుపోతోంది. శ్రీమంతుడు, బ్రహ్మోత్సవం, భరత్ అనే నేను, బృందావనం, లెజెండ్, అరవింద సమేత వంటి సినిమాల్లో మంచి పాత్రలతో గుర్తింపు తెచ్చుకుంది.
ఇన్నేళ్లు వచ్చినా సితార కుమారిగానే ఉంది. పెళ్లికి శాశ్వతంగా దూరమైపోయింది. సితార సినిమాలతో పాటు సీరియల్స్‌లో కూడా నటిస్తోంది. సితార ఇంకా ఎందుకు ? పెళ్లి చేసుకోలేదు అనేదానిపై చాలా మందికి అనేక అనుమానాలు కూడా ఉన్నాయి. తాను ఇప్పటకీ పెళ్లి చేసుకోకపోవడానికి తన జీవితంలో ఓ ముఖ్యమైన వ్యక్తిని కోల్పోవడమే అని సితార ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది. ఆ వ్యక్తి ఎవరో కాదు తమిళ నటుడు మురళీ.
వరుణ్ తేజ్ గద్దలకొండ గణేష్ సినిమాలో వరుణ్‌తేజ్‌తో పాటు నటించిన అధర్వ తండ్రి ఈ మురళీ. తమిళంలో మంచి స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్న మురళీ చిన్న వయస్సులోనే మృతిచెందారు. వీరిద్దరు ప్రాణ స్నేహితులు. వీరిద్దరి మధ్య అప్పట్లోనే బలమైన బంధం ఉండేదన్న టాక్ ఉంది. కాలక్రమంలో ఎవరి దారులు వారివి అయ్యాయి.
ఆ తర్వాత మురళీ పెళ్లి చేసుకున్నా సితార అలాగే ఉండిపోయింది. అయితే మురళీ కూడా 40 ఏళ్ల వయస్సులోనే మృతిచెందారు. ఇక మురళీ మరో పెళ్లి చేసుకున్నాక… ఇటు సితార తండ్రి కూడా మృతి చెందడంతో ఆ షాక్ నుంచి కోలుకునేందుకు సితారకు చాలా టైం పట్టింది. ఆ టైంలో పెళ్లి వయస్సు దాటిపోవడంతో ఆమె పెళ్లికి దూరమైంది.