June 4, 2023

Telugu News Updates

అప్పుడు సాయి పల్లవి..ఇప్పుడు అనుపమ..అదే తప్పు..భారీ మూల్యం చెల్లించుకోక తప్పదా..?

1 min read

అఫ్కోర్స్ ..సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన ప్రతి హీరోయిన్ సక్సెస్ అవ్వాలనే రూల్ లేదు . అలాగే ఫ్లాప్ అయిన హీరోయిన్స్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ తగ్గాలన్న రూల్ కూడా లేదు. కొంతమంది ఇండస్ట్రీలోకి డబ్బు సంపాదించుకోవడానికి హీరోయిన్ గా వస్తారు.. మరి కొంతమంది క్రేజ్ సంపాదించుకోవడానికి హీరోయిన్గా ఎంట్రీ ఇస్తారు ..అయితే చాలా తక్కువ మంది మాత్రమే మహానటి అని గుర్తింపు పొందడానికి ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగు పెడతారు. వాళ్ళల్లో ఈతరం హీరోయిన్స్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉన్న ముద్దుగుమ్మ సాయి పల్లవి .

మలయాళం సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన సాయి పల్లవి ప్రజెంట్ ఇండస్ట్రీకి దూరంగా బ్రతుకుతుంది . కాగా ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోని లేడీ పవర్ స్టార్ అంటూ ట్యాగ్ చేయించుకున్న సాయి పల్లవి కంటెంట్ విషయంలో ఎలాంటి కండిషన్స్ పెడుతుందో అందరికీ తెలిసిందే. నో రొమాన్స్ – నో లిప్ లాక్ -నో వల్గారిటీ.. రెమ్యూనరేషన్ తక్కువ అయినా పర్లేదు ..తన పాత్రకు ప్రాణం పోసే విధంగా ఉంటేనే కథను యాక్సెప్ట్ చేస్తుంది.

ఎదుటివాడు ఎంత పెద్ద హీరో అయినా సరే తన పాత్ర బాగో లేకపోతే రిజెక్ట్ చేస్తుంది సాయి పల్లవి . టాలీవుడ్ మెగాస్టార్ తో ఆఫర్ వచ్చినా సరే కంటెంట్ విషయంలో సాటిస్ఫై కానీ సాయి పల్లవి రిజెక్ట్ చేసి పడేసింది.ఈ విషయాన్ని అఫీషియల్ గానే చెప్పుకొచ్చాడు మెగాస్టార్ చిరంజీవి . కాగా ఇంచుమించు అనుపమ పరమేశ్వరన్ కూడా అలాగే చేస్తుంది .

కంటెంట్ విషయంలో ఎక్కువ కాన్సెంట్రేషన్ తీసుకుంటున్న ఈ బ్యూటీ.. రీసెంట్గా రిలీజ్ అయిన రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో అనుపమ పరమేశ్వరన్ పేరు సోషల్ మీడియాలో మారు మ్రోగిపోతుంది . కార్తికేయ 2 తో హిట్ కొట్టిన అనుపమ .. రీసెంట్ గా వచ్చిన 18 పేజీస్ లోనూ తన నటనకు మంచి మార్కులు వేయించుకుంది.

ఈ క్రమంలోనే అనుపమ ఎక్స్పోజింగ్ కి, వల్గారిటీకి దూరంగా కంటెంట్ ఉన్న పాత్రలోనే నటించాలని ఆశ పడుతుందట . ఒకవేళ అదే నిజమైతే ప్రజెంట్ సాయి పల్లవి ఎదుర్కొనే సిచువేషన్ త్వరలోనే అనుపమ ఎదుర్కోవాల్సి వస్తుంది అంటున్నారు సినీ విశ్లేషకులు . సినిమా ఇండస్ట్రీ అన్నాక అన్ని రంగులు కలిసి ఉండాలి . అప్పుడే జనాలు వాళ్ళని హీరోయిన్ గా యాక్సెప్ట్ చేయగలరు.

కేవలం నటన మాత్రమే చేస్తాము అంటే కుదరదు . అలా అనుకోని సాయి పల్లవి పప్పులో కాలేసి ఇప్పుడు ఆఫర్లు లేక అల్లాడిపోతుంది. ఒకవేళ ఆమెని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటే అనుపమ పొజిషన్ కూడా అదే.. రానున్న రోజుల్లో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు అంటూ సినీ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. చూడాలి మరి అనుపమ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో..?

Leave a Reply

Your email address will not be published.

Copyright © All rights reserved.