June 4, 2023

Telugu News Updates

ఎన్టీఆర్‌ను భార్య ముద్దుగా ఎలా పిలుస్తుందో తెలుసా..? ప్రణతి ఇంత రొమాంటికా..!!

1 min read

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది జంటలు ఉన్న అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది ఎన్టీఆర్ – లక్ష్మీ ప్రణతి జంట . ఈ కాలంలో అందరూ పెళ్లికి ముందే తప్పులు చేస్తూ ప్రేమించుకున్నామంటూ.. ఇంట్లో పెద్దలను ఎదిరించి ..బలవంతంగా ఒప్పించి ..పెళ్లిళ్లు చేసుకుంటుంటే స్టార్ హీరోగా ఉన్న ఎన్టీఆర్ మాత్రం తన పెళ్లి విషయంలో పూర్తి బాధ్యతలను తల్లిదండ్రులకు అప్పచెప్పేశారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ పెద్దలు కుదిర్చిన‌ అమ్మాయి లక్ష్మీ ప్రణతిని చేసుకొని హ్యాపీగా తన మ్యారేజ్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు .

కాగా అందరూ స్టార్ హీరో భార్యల్లా లక్ష్మి ప్రణతి హంగామాలకి పోదు . భర్త గౌరవాలను గౌరవిస్తూ ఆయన అడుగుజాడల్లో నడుచుకుంటూ ఉంటుంది. ఈ విషయం ఆమెను చూసిన ఎవరికైనా అర్థమైపోతుంది . లక్ష్మీ ప్రణతి బయట ప్రపంచానికి కనిపించింది చాలా తక్కువ .. ఎప్పుడు కనిపించిన భర్తతో పిల్లలతో అత్తగారితోనే కనిపిస్తూ ఉంటుంది.

రీసెంట్గా ఆర్ఆర్ఆర్ సినిమాకు గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ రావడంతో భర్తతో పాటు ఆ ఈవెంట్లో పాల్గొన్న ప్రణతి ..చాలా సరదాగా కనిపించింది . ఈ క్రమంలోనే లక్ష్మీ ప్రణతి ఇంటిలో ఎన్టీఆర్ ని ఏమని పిలుస్తుంది అనే విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఎన్టీఆర్ ఫ్యామిలీ స‌ర్కిల్స్‌ సమాచారం ప్రకారం ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి ఎన్టీఆర్ ని అందరూ ఉన్నప్పుడు ఏవండి అని పిలుస్తుందట.

అంతేకాదు ఏదైనా ఈవెంట్ కి వెళ్ళిన ఏదైనా ఫంక్షన్ కి వెళ్ళిన భర్తను గౌరవిస్తూ ఏవండీ అని పిలవడం తన అత్తగారి దగ్గర నుంచి నేర్చుకున్నానని ఆమె చెప్పకు వస్తుందట . అంతేకాదు తారక్ – ప్రణతి ఇద్దరు ఉన్నప్పుడు మాత్రం రకరకాల పేర్లతో పిలుచుకుంటూ ఉంటారట. బుజ్జి – కన్నయ్య – తారక్-బేబీ అని కానీ ఎన్టీఆర్ కి ప్రణతి శ్రీవారు అని పిలవడం చాలా నచ్చుతుందట.

ఆమె అలా పిలిస్తే చాలా హ్యాపీగా ఉంటుందని . అదేదో తెలియని కొత్త ఫీలింగ్ కలుగుతుందని.. తారక్ తన ఫ్రెండ్స్ వద్ద చెప్పుకొని సంబరపడిపోయాడట . ఏది ఏమైనా సరే పైకి చాలా సైలెంట్ గా కనిపించే ప్రణతి కూడా చాలా సరదాకల మనిషి అని తెలుస్తుంది. ఏది ఏమైనా ఇద్దరు పిల్లలతో హ్యాపీగా చూడ చక్కగా జీవిస్తూ ఉంది ఈ జంట్. వీళ్లు ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలని కోరుకుందాం..!!

Leave a Reply

Your email address will not be published.

Copyright © All rights reserved.