బాలయ్యకు ఆ హీరోయిన్ను నిజంగానే పెళ్లి చేసుకోవాలనుకున్నాడా… విజయశాంతి కాదు…!

బాలయ్య కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడు కొందరు హీరోయిన్లతో ఎక్కువ సినిమాలలో నటించారు. అందులో లేడీ అమితాబచ్చన్ విజయశాంతి ఒకరు. బాలయ్య – విజయశాంతి కాంబినేషన్‌కు ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీరిద్దరి కాంబినేషన్లోనే ఎక్కువ సినిమాలు వచ్చాయి. అప్పట్లో వీరి కాంబినేషన్‌కు మంచి హిట్ ఫెయిర్ అన్న పేరు ఉండేది. బాలయ్య – విజయశాంతి కాంబినేషన్ అంటే మాస్ జనాలు కిక్కెక్కి పోయి ఉండేవారు.
వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కిన సినిమాల్లో శతదినోత్సవాలు, రజతోత్సవాలు, జరుపుకున్న సినిమాలు ఎన్నో ఉన్నాయి. వీరి కాంబినేషన్లో కోదండ రామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన నిప్పురవ్వ చివరి సినిమా. ఆ తర్వాత వీరిద్దరి కాంబోలో మళ్లీ సినిమా రాలేదు. ఇదిలా ఉంటే బాలయ్య – విజయశాంతి క్లోజ్ రిలేషన్‌పై అప్పట్లో చాలా వార్తలు, పుకార్లు బయట వినిపించేవి.
అయితే విజయశాంతితో కాకుండా బాలయ్య మరో హీరోయిన్ను ప్రేమించాడని.. ఆమెను పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నాడని అప్పట్లో మద్రాస్ పత్రికలు కోడై కూశాయి. ఆ హీరోయిన్ ఎవరో కాదు కోలీవుడ్ సీనియర్ హీరోయిన్ ఖుష్బూ. ఖుష్బూ తెలుగులో వెంకటేష్ కలియుగ పాండవులు, నాగార్జుతో కెప్టెన్ నాగార్జున లాంటి సినిమాల్లో నటించింది. అప్పట్లో మద్రాస్‌లో ఉన్న సమయంలో బాలయ్య – ఖుష్బూ మంచి స్నేహితులు అవ్వడంతో పాటు కలిసి కూడా తిరిగేవారట.
వీరిద్దరి సాన్నిహిత్యం పీక్స్ స్టేజ్‌కు చేరిపోవడంతో ఆ విషయం ఎన్టీఆర్ దృష్టికి వెళ్లిందట. దీంతో ఎన్టీఆర్ ఆఘమేఘాల మీద బాలయ్యకు పెళ్లి చేసే బాధ్యత అప్పటి ఆయన బెస్ట్ ఫ్రెండ్, తర్వాత ముఖ్యమంత్రిగా పనిచేసిన నాదెండ్ల భాస్కరరావుకు అప్పగించారట. దీంతో నాదెండ్ల కాకినాడలో ఉన్న తన బంధువుల ద్వారా వసుంధరతో బాలయ్య పెళ్లి కుదిర్చి చేశారు.