కాజల్ అంటే ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతికి ఎందుకంత ఇష్టం..! అదే కారణమా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన 22 ఏళ్ల కెరీర్‌లో 29 సినిమాలలో నటించారు. త్రిబుల్ ఆర్ ఆయనకు 29వ సినిమా. ఇన్నేళ్లలో ఎన్టీఆర్ ఎంతో మంది హీరోయిన్లను రిపీట్ చేశాడు. ఒక్కసారి ఎన్టీఆర్ రిపీట్ చేసిన హీరోయిన్లు, ఆ సినిమాల లిస్ట్ చూస్తే గజాలా స్టూడెంట్ నెంబర్ 1, అల్లరి రాముడు – భూమిక సింహాద్రి, సాంబ – జెనీలియా నా అల్లుడు, సాంబ – ఇలియానా రాఖీ, శక్తి – సమంత బృందావనం, జనతా గ్యారేజ్, రామయ్యా వస్తావయ్యా, రభస – ఆర్తీ అగర్వాల్ అల్లరి రాముడు, నరసింహుడు – కాజల్ బృందావనం, టెంపర్, బాద్ షా సినిమాలు ఉన్నాయి.
అయితే ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి కూడా ఇటీవల కాలంలో ఎన్టీఆర్ లుక్స్, బాడీ ఫిట్‌నెస్ ఇతర విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ వస్తోంది. కరోనా టైం నుంచి లక్ష్మీ ప్రణతి ఈ కేర్ తీసుకోవడం స్టార్ట్ చేసింది. ఎన్టీఆర్ నటించిన అన్ని సినిమాలు కూడా లక్ష్మీ ప్రణతి చూసి తన సందేహాలను భర్తతో చెప్పి క్లీయర్ చేసుకోవడం ఆమెకు అలవాటే.
అయితే ఎన్టీఆర్‌తో నటించిన హీరోయిన్లు అందరికంటే కూడూ కాజల్ అంటే ఎందుకో ఆమెకు ప్రత్యేకమైన అభిమానం అట. లక్ష్మీప్రణతితో ఎన్టీఆర్ పెళ్లి 2011లో అయ్యింది. ఆ తర్వాత ఎన్టీఆర్ కెరీర్ గ్రాఫ్ సడెన్‌గా పడిపోయింది. అన్నీ సినిమాలు ప్లాప్ అయ్యాయి. అదే యేడాది శక్తి పెద్ద డిజాస్టర్. తర్వాత కూడా దమ్ము, రామయ్యా వస్తావయ్యా, రభస అట్టర్ ప్లాప్. ఆ తర్వాత టెంపర్ నుంచి ప్రారంభమైన ఎన్టీఆర్ విజయాల ప్రస్థానం త్రిబుల్ వరకు కంటిన్యూగా కొనసాగుతోంది.
అయితే ఎన్టీఆర్ పెళ్లయ్యాక కెరీర్ పరంగా గ్రాఫ్ డౌన్ అయినప్పుడు లక్ష్మీ ప్రణతి కూడా ఎంతో బాధపడేదట. వరుస ప్లాపులతో ఎన్టీఆర్‌కు కూడా సరిగా నిద్రపట్టేదే కాదట. చివరకు ఈ పరాజయాలకు టెంపర్ సినిమాతో బ్రేక్ పడింది. అయితే టెంపర్ నుంచి అసలు ఎన్టీఆర్ వెనక్కు తిరిగి చూసుకోలేదు. ఈ సినిమాలో కాజల్ హీరోయిన్.
ఎన్టీఆర్ విజయాల ప్రస్థానం ప్రారంభమైన టెంపర్‌లో కాజల్ హీరోయిన్. ఆ తర్వాత జనతా గ్యారేజ్‌లోనూ ఆమె స్పెషల్ సాంగ్‌లో నటించింది. ఓవరాల్‌గా కూడా కాజల్ ఎన్టీఆర్‌కు లక్కీ హీరోయిన్. ఆమెతో చేసిన బృందావనం – టెంపర్ – బాద్ షా – తో పాటు స్పెషల్ సాంగ్ చేసిన జనతా గ్యారేజ్ కూడా హిట్టే.. ఆమె ఎన్టీఆర్‌కు లక్కీ హీరోయిన్. అందుకే కాజల్ అంటే లక్ష్మీ ప్రణతికి ఎందుకో కాస్త ఇష్టం అట. అదీ సంగతి..!