ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలకు టీడీపీ టిక్కెట్లు ఫిక్స్ చేసిన చంద్రబాబు..!

ఈ టైటిల్ చూడడానికి కాస్త విచిత్రంగా ఉండి ఉండొచ్చు. కానీ ఏపీలో ప్రస్తుతం శరవేగంగా మారుతోన్న రాజకీయ పరిణామాలు గమనిస్తుంటే అవుననే చెప్పాలి. వైసీపీలో పేరుకు 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరికి తోడు టీడీపీ నుంచి వెళ్లిన నలుగురు, జనసేన నుంచి గెలిచిన రాపాక వరప్రసాద్‌ను కలుపుకుంటే 156 మంది ఎమ్మెల్యేల మద్దతు జగన్‌కు ఉన్నట్టే..! అయితే ఏపీలో ఎన్నికలకు మరో యేడాది టైం ఉండగా వైసీపీ ఎమ్మెల్యేల్లో తమ పార్టీ అధినేతపై నివురు గప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తి ఒక్కసారిగా బయటకు వస్తోంది.
వాళ్లంతట వాళ్లే బరస్ట్ అయిపోతున్నారు. ఈ నాలుగేళ్లలో వాళ్లు చెప్పుకోవడానికి చేసిన పనంటూ ఒక్కటీ లేదు. అసలు చాలా మంది ఎమ్మెల్యేలకు.. ఇంకా చెప్పాలంటే సగం మంది ఎమ్మెల్యేలకు జగన్ దర్శన భాగ్యం యేడాదికి ఒక్కసారి కూడా లేని పరిస్థితి. ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలు వదిలేస్తే అస్సలు చాలా నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు జీరోయే.
ఈ విషయంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ఏం చేయలేని పరిస్థితి ఉంది. ఎన్నోసార్లు సీఎంను కలిసి అర్జీలు పెట్టుకున్నా ఆన్సర్ లేదు. దీనికి తోడు గ్రూపు రాజకీయాలు ఇవన్నీ వైసీపీలో ఇప్పటి వరకు బడబాగ్నిలా ఉన్న జ్వాలను ఎగిసిపడేలా చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి పార్టీపై చాలాసార్లు తన అసమ్మతి వ్యక్తం చేశారు. జగన్ కూడా ఆయన్ను బయటకు సాగనంపే క్రమంలోనే వెంకటగిరికి నేదురుమిల్లి రామ్‌కుమార్ రెడ్డిని ఇన్‌చార్జ్‌ను చేసేశారు.
ఇక ఆనం టీడీపీలోకి రావడమే తరువాయి. ఆయన కూడా టీడీపీ నేతలతో మంతనాలు మొదలు పెట్టేశాడు. ఆయన పార్టీలోకి వస్తే ఆత్మకూరు సీటు పక్కా అంటున్నారు. అలాగే కీలకమైన కృష్ణా జిల్లాలోని మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌కు కూడా జగన్ పొగ పెట్టే పరిస్థితే ఉంది. అందుకే వసంత కూడా ఇటీవల వైసీపీపై చిర్రుబుర్రు లాడుతున్నాడు. తన నియోజకవర్గంలో మంత్రి జోగి రమేష్ పెత్తనం ఎక్కువ కావడంతో పాటు పోలీసు అధికారుల బదిలీల విషయంలో తనను కాదని మంత్రి మాటకే ప్రయార్టీ ఇవ్వడంతో ఆయన తట్టుకోలేక పోతున్నారు.
ఈ క్రమంలోనే ఆయన చంద్రబాబు, లోకేష్‌కు అనుకూలంగా మాట్లాడుతున్నారన్న ప్రచారం కూడా నడుస్తోంది. ఆయన అడుగులు కూడా టీడీపీ వైపే ఉన్నాయని.. ఆయన కూడా వచ్చే ఎన్నికల్లో మైలవరం టీడీపీ అభ్యర్థి అవుతారని అంటున్నారు. మాజీ మంత్రి దేవినేని ఉమా గన్నవరం నుంచి పోటీ చేయవచ్చని టాక్ ? ఏదేమైనా వైసీపీ రాజకీయాలు చాలా స్పీడ్‌గా మారుతున్నాయి.