నటి శిరీషను కూడా అవకాశాలిస్తామని వాడేశారా… వాళ్లు ఎవరో కూడా చెప్పేసిందిగా..!

సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది ఏ రేంజ్‌లో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చాలా మంది కెరీర్ స్టార్టింగ్‌లో అవకాశాల కోసం కాస్టింగ్ కౌచ్‌కు గురవుతుంటారు. అయితే మరి కొందరు ఛాన్సులు వచ్చాక స్టార్ రేంజ్‌కు ఎదిగేందుకు, కోరికలు తీర్చుకోవడం, విచ్చలవిడి తనానికి అలవాటు పడడం, ఎంజాయ్‌మెంట్ కోసం కూడా పక్క సుఖాలు పంచుతూ ఉంటారు. నార్త్ నుంచి సౌత్ వరకు ఇది మామూలుగా జరిగే తంతే.
ఈ కాస్టింగ్ కౌచ్, పక్క సుఖాలు ఇచ్చి స్టార్ స్టేటస్‌కు ఎదగడం అనేది.. ఇప్పటి నుంచే కాదు గత 40 – 50 ఏళ్ల నుంచి కూడా నడుస్తోందే. ఇక గత నాలుగైదేళ్లుగా సోషల్ మీడియా యుగం పెరిగిపోతూ ఉండడంతో ఎవరికి వారు ధైర్యంగా ముందుకు వచ్చి తాము గతంలో ఎదుర్కొన్న లైంగీక వేధింపులపై ఓపెన్ అవుతున్నారు. అయితే చాలా మంది అమ్మాయిలను అవకాశాల పేరుతో వాడుకుని మోసం కూడా చేస్తూ ఉంటారు.
కొందరు కమిట్మెంట్లు ఇచ్చినా కూడా ఛాన్సులు లేక మోసపోయిన వారు కూడా ఉన్నారు. తాము వాళ్లకు సర్వస్వం అర్పించేసి, అన్నీ సుఖాలు ఇచ్చినా కూడా తమకు అవకాశాలు ఇవ్వలేదని బాధపడుతోన్న వారు కూడా ఇండస్ట్రీలో ఉన్నారు. టాలీవుడ్ , సీరియల్ నటి శిరీష గురించి చెప్పక్కర్లేదు. ఆమె నటిగా ఇండస్ట్రీలో చాలా సినిమాలు చేసింది. అయితే ఇప్పుడు సరైన అవకాశాలు లేక ఇబ్బందులు పడుతోంది.
ఆమె సినిమాలపై మోజుతో రాజమండ్రి నుంచి హైదరాబాద్‌కు వచ్చేసింది. ఆమె రాజమండ్రిలో పదో తరగతి వరకే చదువుకుంది. హైదరాబాద్‌కు వచ్చాక తన ఫ్రెండ్ అయిన జూనియర్ ఆర్టిస్టు సాయంతో ఆమె అవకాశాల కోసం ఎన్నో ఇబ్బందులు పడడంతో పాటు దర్శక నిర్మాతలకు కమిట్‌మెంట్ ఇచ్చి లొంగిపోయిన సందర్భాలు ఉన్నాయట. ఈ విషయాన్ని ఆమే స్వయంగా చెప్పింది.
కొందరు అవకాశాల పేరుతో తనను వాడుకున్నారని.. శారీరకంగా ఇష్టం వచ్చినట్టు వాడుకున్నారని వాపోయింది. ఒకప్పుడు వరుస అవకాశాలతో బిజీగా ఉండడంతో ఫైనాన్షలో లోన్లు తీసుకుని ఇళ్లు, కారు కొన్నానని.. ఇప్పుడు అవకాశాలు లేక అన్నీ పోయాయని బాధపడింది. చాలామంది కమిట్‌మెంట్ పేరుతో తనను లొంగదీసుకున్నారని ఆమె బాధపడుతోంది.