బస్టాప్ హీరోయిన్ ఆనంది భర్త టాప్ డైరెక్టరే..!

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్ లు అవకాశాలు తగ్గాయంటే చాలు సినిమాలకు గుడ్ బై చెప్పి పెళ్లి చేసుకుంటారు. అడపాదడపా సినిమాలు చేసే కంటే పెళ్లి చేసుకోవడమే బెటర్ అనుకుంటారు. అయితే పెళ్లి తరవాత కూడా కొంతమంది ఛాన్స్ లు వస్తే సినిమాల్లో నటిస్తారు. కానీ కొంతమంది మాత్రం అసలు సినిమాల వైపు మళ్లీ తిరిగి చూడరు. ఇక బస్టాప్, ఈ రోజుల్లో సినిమాలతో కుర్రాళ్ల ఫేవరెట్ గా మారిపోయిన హీరోయిన్ ఆనంది కూడా చాలా తక్కువ సినిమాలు చేసి ఆ తరవాత సినిమాలకు దూరం అయ్యింది.
మారుతి దర్శకత్వంలో వచ్చిన ఈరోజుల్లో సినిమాతో ఆనంది హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తరవాత కొన్ని సినిమాల్లో నటించింది. చూడ్డానికి పక్కింటి అమ్మాయిలా కనిపించే ఈ ముద్దుగుమ్మ మన తెలుగమ్మాయే…ఆనంది పుట్టింది పెరిగింది వరంగల్ లోనే. ఇక ఆనంది తెలుగులో ఆఫర్ లు తగ్గిపోవడంతో ఆ తరవాత తమిళ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ హీరోయిన్ గా మంచి గుర్తింపు సంపాదించుకుంది.
అంతే కాకుండా ఆనంది అసలు పేరు రక్షిత కాగా తమిళ ఇండస్ట్రీలో అడుపెట్టిన సమయంలో తన పేరును ఆనందిగా పరిచయం చేసుకుంది. చండీవర్ సినిమాలో తన నటనతో తమిళ ప్రేక్షకులను ఫిదా చేసింది. ఇక తమిళ చిత్రాలలో నటిస్తున్న సమయంలో అసిస్టెంట్ డైరెక్టర్ సోక్రటీస్ తో ప్రేమలో పడింది. ఆనంది హీరోయిన్ గా నటించిన ఓ తమిళ సినిమాకు కూడా సోక్రటీస్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు.
ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ తరవాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. సోక్రటిస్ భావ నవీన్ కూడా దర్శకుడు కావడం విశేషం. అలా ఆనంది తమిళ ఇండస్ట్రీలో ఎంతో బ్యాగ్రౌండ్ ఉన్న ఇంటికి కోడలు అయ్యింది. ఇక ప్రస్తుతం ఆనంది సినిమాలకు దూరంగా ఉంటోంది. హ్యాపీగా భర్తతో ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది.