బన్నీ ప్రాణం కంటే ఎక్కువుగా ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్న స్టార్ హీరో..ఎవ్వరికి తెలియని టాప్ సీక్రేట్..!
1 min read
సినిమా ఇండస్ట్రీలో లవ్వులు, డేటింగులు ,ఎఫైర్లు , డివర్స్ లు చాలా చాలా కామన్ గా వినిపిస్తుంటాయి. ఈ మధ్యకాలంలో మరీ ఎక్కువగా ఈ తంతు వినిపిస్తూనే ఉంది. అయితే అలా ఇండస్ట్రీలో ప్రేమించిన జంటలు అన్ని పెళ్లి చేసుకుంటున్నాయా..? అంటే నో అని చెప్పాలి . చాలామంది హీరోలు , డైరెక్టర్లు , ప్రొడ్యూసర్లు తము ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోకుండానే వదిలేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఆ లిస్టులోకే వస్తాడు మన టాలీవుడ్ స్టైలిష్ స్టార్ బన్నీ .
ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. టాలీవుడ్ స్టైలిష్ స్టార్ బన్నీ ప్రజెంట్ ఎలాంటి పొజిషన్లో ఉన్నాడో అందరికీ తెలిసిందే. పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవల్ లో గుర్తింపు సంపాదించుకున్న ఈ హీరో..త్వరలోనే పుష్ప2 తో మరో క్రేజీ హిట్ ని తన ఖాతాలో వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు . కాగా ఇలాంటి టైం లోనే బన్నీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ మ్యాటర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.
మనకు తెలిసిందే బన్నీ – స్నేహ రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు . అయితే స్నేహ కంటే ముందే బన్నీ మరో స్టార్ హీరోయిన్ ని ప్రేమించాడు అన్న న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఆ హీరోయిన్ ఎవరో కాదు అందాల ముద్దుగుమ్మ ఐశ్వర్యరాయ్. ఇదే విషయాన్ని గతంలో బన్నీ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు . “తాను స్కూల్ ఏజ్ లో ఉన్నప్పటి నుంచే ఐశ్వర్య రాయ్ ని ఇష్టపడ్డాడని.. గాఢంగా ప్రేమించాడని.. అంతేకాదు అల్లు అరవింద్ కి సైతం నేను పెళ్ళంటూ చేసుకుంటే ఐశ్వర్య రాయ్ నే చేసుకుంటానని కూడా చెప్పాడట.
అయితే కొన్ని సంవత్సరాలకి ఐశ్వర్య రాయ్- అభిషేక్ బచ్చన్ ని పెళ్లి చేసుకోవడంతో .. ఐశ్వర్య రాయ్ తనని చీట్ చేసిందని బాధపడిన బన్నీ ..ఆమెను హేట్ చేయడం స్టార్ట్ చేశాడట. ఆ వయసులో తెలిసి తెలియక చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అంతేకాదు ఈ విషయం తన భార్య స్నేహారెడ్డికి కూడా పూర్తిగా తెలుసని రీసెంట్ ఇంటర్వ్యూలో బన్నీ చెప్పుకురావడం తో నవ్వుకుంటున్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్ . దీంతో బన్నీ కూడా లవ్ ఫెయిల్యూర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్..!!